కేజీఎఫ్ హీరో గొప్ప మనసు.. క్యాన్సర్‌ బాధితుడికి వీడియో కాల్..! | Toxic star Yash video calls fan battling cancer | Sakshi
Sakshi News home page

Yash: యశ్ గొప్ప మనసు.. క్యాన్సర్‌ బాధితుడికి భరోసా..!

Jun 2 2026 9:04 PM | Updated on Jun 2 2026 9:04 PM

Toxic star Yash video calls fan battling cancer

కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో ప్రస్తుతం టాక్సిక్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ జూన్‌లో రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న రామాయణలోనూ యశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ యశ్ తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక అభిమాని సునీల్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతనిలో ధైర్యం నింపారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అభిమాన హీరో మాట్లాడడంతో క్యాన్సర్ బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. యశ్ ఆత్మీయ సంభాషణ అతనిలో కొత్త భరోసాను తీసుకొచ్చింది.

y

క్యాన్సర్‌తో పోరాడుతున్న సునీల్  శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడు కావడం విశేషం.  అతనికి చికిత్స సమయంలో అండగా ఉంటానని కూడా యశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎంత బిజీగా ఉన్నా తన అభిమానితో వీడియో కాల్ చేసి మాట్లాడటంతో యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement