వివాహిత బలవన్మరణం | Women Suicide In Kurnool | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Aug 1 2018 7:54 AM | Updated on Aug 1 2018 7:54 AM

Women Suicide In Kurnool - Sakshi

మృతిచెందిన రాములమ్మ

దేవనకొండ(కర్నూలు): మండలంలోని మాదాపురం గ్రామంలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..  పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ(25)కు మండలంలోని మాదాపురం గ్రామానికి చెందిన సురేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్ల పాటు వారి సంసారం సాఫీ సాగింది. అయితే గతేడాది నుంచి అదనపు కట్నం తేవాలని భర్తతోపాటు అత్త మారెమ్మ రాములమ్మను నిత్యం వేధిస్తుండే వారు.

ఈనేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ గంగయ్యయాదవ్‌ ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా భర్త, అత్త కలిసి రాములమ్మను చంపేసి ఉరి వేసుకున్నట్లు సృష్టించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement