కుమారుడు మందలించాడని తల్లి ఆత్మహత్య  | Women Suicide In Kurnool | Sakshi
Sakshi News home page

కుమారుడు మందలించాడని తల్లి ఆత్మహత్య 

Jul 14 2018 7:03 AM | Updated on Jul 14 2018 7:03 AM

Women Suicide In Kurnool - Sakshi

ఆత్మహత్య  చేసుకున్న నాగమ్మ

ఆదోని టౌన్‌: కుమారుడు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. హొళగుంద ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ వివరాల మేరకు.. హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన వీరేష్‌కు కొన్నేళ్ల క్రితం వడ్డే నాగమ్మ(45)తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. అయితే వీరేష్‌ 15 రోజుల క్రితం వరుసకు కోడలైన మరో మహిళతో బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఇటీవల అక్కడ బేల్దారి పని చేస్తుండగా గాయపడ్డాడు.

ఈ విషయాన్ని అతడు భార్యకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. దీంతో ఆమె భర్తను చూసేందుకు వెళదామని కుమారులను కోరింది. దీనిపై రెండో కుమారుడు రాజు తల్లిని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో శుక్రవారం మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement