మహిళ అస్థిపంజరం లభ్యం | Women Skeleton In Medak | Sakshi
Sakshi News home page

మహిళ అస్థిపంజరం లభ్యం

Jun 16 2018 9:36 AM | Updated on Oct 16 2018 3:15 PM

Women Skeleton In Medak - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెద్దశంకరంపేట(మెదక్‌) : మండల పరిధిలోని జూకల్‌ శివారులో  గుర్తుతెలియని మహిళ అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్‌ఐ విజయరావ్‌ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో మహిళ మృత దేహం ఉన్నట్లు గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు.

సుమారు 35 నుంచి 40 ఏళ్ల లోపు మహిళ అస్థిపంజరంగా గుర్తించామన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతదేహంపై ఎరుపురంగు చీర, ఎరుపు,తెలుపు జాకెట్‌ ధరించి ఉన్నట్లు ఆయన తెలిపారు. వీఆర్వో అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement