రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | Women Died In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

May 23 2018 1:43 PM | Updated on May 23 2018 1:43 PM

Women Died In Road Accident - Sakshi

శాంతాదేవికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే సండ్ర

కల్లూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇమ్మడి శాంతాదేవి (47) మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇమ్మడి చిన్న వీరభద్రరావు, శాంతాదేవి దంపతులు ద్విచక్ర వాహనం పై యోగా క్లాసుకు స్థానిక షుగర్‌ ఫ్యాక్టరీకి వెళుతుండగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదంలో అంతకు ముందే మృతి చెందిన గేదె పైకి ద్విచక్ర వాహనాన్ని ఎక్కించడంతో అదుపు తప్పి పడి పోయింది.

ఈ ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న శాంతాదేవి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పెనుబల్లి తరలించారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి కల్లూరులోని చిన్న వీరభద్రం ఇంటికెళ్లి శాంతాదేవి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement