బైక్‌ లారీ కిందకు వెళ్లిపోవడంతో.. | Women Died in Bike Accident Medchal | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ మృతి

Sep 28 2019 9:16 AM | Updated on Sep 28 2019 9:39 AM

Women Died in Bike Accident Medchal - Sakshi

లారీ కిందకు వెళ్లిన బైక్‌

మేడ్చల్‌: బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్త కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  సిద్దిపేట జిల్లా,  వర్గల్‌ మండలం, గుంటిపల్లి గ్రామానికి చెందిన శ్యామ్‌కుమార్‌ శుక్రవారం తన అత్తగారి ఊరైన మెదక్‌ జిల్లా, జీడీపల్లి గ్రామానికి వెళ్లాడు. తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో డాక్టర్‌కు చూపించేందుకు గాను  భార్య  సరస్వతి కుమారుడు కేశవర్ధన్‌(8)తో కలిసి బైక్‌పై  ఘనాపూర్‌  మెడిసిటి ఆసుపత్రికి వస్తుండగా మేడ్చల్‌ ఆర్టీసీ డిపో వద్ద కంటెయినర్‌ ఢీకొనడంతో బైక్‌ లారీ కిందకు వెళ్ళిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం నగర శివార్లలోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సరస్వతి  మృతి చెందింది. శ్యాంకుమార్, కేశవర్ధన్‌ చికిత్స పొందుతున్నారు. మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement