వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. | Woman Kills Husband With Help Of Her Husband In Nalgonda | Sakshi
Sakshi News home page

Oct 12 2018 9:04 PM | Updated on Jul 12 2019 3:07 PM

Woman Kills Husband With Help Of Her Husband In Nalgonda - Sakshi

అడ్డగూడూరు(తుంగతుర్తి) : వివాహేతర సంబం ధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. ఈ సంఘటన గురువారం అడ్డగూడూరు మండలం మానాయికుంటలో జరిగింది. మృతుడి బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మానాయికుం ట గ్రామానికి చెందిన మెరుగు కొమురయ్య(36), కొమురమ్మ దంపతులు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కడారి ఇద్దయ్య అనే వ్యక్తితో కొమురమ్మకు పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కొమురయ్యకు తెలియడంతో భార్య కొమురమ్మను పలుమార్లు మందలించా డు. అయినా తనలో ఏ మార్పు రాకపోవడంతో తరచూ భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తమ వివాహేతర సంబంధానికి కొమురయ్య అడ్డుగా వస్తున్నాడని భావించిన ఇద్దయ్య, కొమురమ్మ అతన్ని అంతమొందించాలని పథకం పన్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కొమురయ్య ఇంట్లోనే భార్య కొమురమ్మ తన ప్రియుడితో కలిసి దాడి చేసి కొమురయ్యను బాగా కొట్టారు. మర్మావయవాలపై కొట్టడంతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలు తెలు సుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడికి కూమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement