అప్పులబాధతో మహిళా రైతు | Woman Farmer Commits Suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో మహిళా రైతు ఆత్మహత్య

May 15 2018 9:32 AM | Updated on Nov 6 2018 8:16 PM

Woman Farmer Commits Suicide - Sakshi

తులశమ్మ (ఫైల్‌)

నార్పల (బుక్కరాయసముద్రం): నార్పల మండలం బి.పప్పూరులో అప్పుల బాధతో ఓ మహిళా రైతు సోమవారం ఆత్మహత్యకు పాల్పంది. స్థానికులు తెలిపిన మేరకు.. బి. పప్పూరుకు చెందిన తులశమ్మ (25), రంగారెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి మృతి చెందాడు. వైద్యం కోసం రూ.4లక్షల దాకా వెచ్చించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటి నుంచి కుటుంబ భారం తులశమ్మపై పడింది. తమకున్న ఐదు ఎకరాల్లో రూ.5లక్షల పెట్టుబడి పెట్టి అరటి సాగు చేసింది.

ఇటీవల గాలీవానకు పంటమొత్తం నేలకొరిగింది. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. రంగారెడ్డి పేరుపై బి.పప్పూరులోని ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.4లక్షలు, నార్పల స్టేట్‌బ్యాంకులో రూ.లక్ష మేర రుణాలు ఉన్నాయి. ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ.6 లక్షల మేర అప్పులు చేశాడు. తోడుంటాడనుకున్న భర్త కానరానిలోకాలకు వెళ్లిపోయాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు భారీగా పెరిగిపోయాయి. వాటిని ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితిలో తులశమ్మ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement