బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి.. యువతిపై అత్యాచారం | Woman Assaulted After Boyfriend Thrashed In Tamil Nadu | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి.. యువతిపై సామూహిక అత్యాచారం

Jan 20 2020 11:47 AM | Updated on Jan 20 2020 12:58 PM

Woman Assaulted After Boyfriend Thrashed In Tamil Nadu - Sakshi

చెన్నై : తమిళనాడులోని వెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను కూడా చితకబాదారు. వెల్లూరు కోట సమీపంలో శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, వస్తువులను తీసుకెళ్లిపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోకరి కోసం గాలిస్తున్నారు. కాగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2018లో భారత్‌లో 34 వేల అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. అలాగే 2018లో సరాసరిన దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ అత్యాచార ఘటన చోటుచేసుకుందని కేంద్ర ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement