భార్యను చంపి, కిటికీకి ఉరివేసి..  | Wife Murder By Husband In Karnataka | Sakshi
Sakshi News home page

భార్యను చంపి, కిటికీకి ఉరివేసి.. 

Jul 21 2019 8:49 AM | Updated on Jul 21 2019 8:56 AM

Wife Murder By Husband In Karnataka - Sakshi

క్రిష్ణగిరి: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను మానవత్వం మరచి హత్య చేశాడో మృగాడు. భార్యను దారుణంగా హత్య చేసి ఉరికి వేలాడదీసి పరారైన భర్త కోసం సూళగిరి పోలీసులు గాలిస్తున్నారు. విళుపురం జిల్లా శంకరాపురం సమీపంలోని మరిది గ్రామానికి చెందిన ఇళయరాజ భార్య శాంతి (33) హతురాలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగ నిమిత్తం భార్యాభర్తలిరువురూ గత 15 రోజుల క్రితం సూళగిరికి వచ్చారు. సూళగిరి దిగువపేటలో బాడుగ ఇంట్లో నివాసముంటూ వచ్చారు. శుక్రవారం రాత్రి ఇళయరాజ భార్య శాంతిని హత్య చేసి కిటికీ ఆమెను ఉరిలో వేలాడదీసి పరారయ్యాడు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికెళ్లి శాంతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని పరారైన భర్తపై హత్య కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ సంఘటన సూళగిరి ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement