'వెతక్కండి.. నేను వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదు'

Wife Leaves House With Children After Writing Letter To Husband In Musheerabad - Sakshi

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

సాక్షి, ముషీరాబాద్‌: ‘నా కోసం వెతక్కండి... నేను వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదు’... అంటూ ఓ లేఖ రాసి ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌ డివిజన్‌ వెంకటేశ్వరకాలనీకి చెందిన వెంకటరమణ, రజిని లావణ్య దంపతులకు ప్రణతి ప్రియ(8), దేవాన్‌‡్ష (5) సంతానం. ఈ నెల 3న వెంకటరమణ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే సరికి ఇళ్లంతా ఖాళీగా ఉంది. స్థానికులను విచారించగా రజిని లావణ్య ఇంట్లో సామాను సర్దుకుని ఇద్దరు పిల్లలతో సహా వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇంట్లో లభ్యమైన లేఖలో తన కోసం వెతకొద్దని, తాను వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదని పేర్కొంది. వెంకటరమణ ఫిర్యాదు మేరకు బుధవారం ముషీరాబాద్‌  ఎస్సై వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top