భర్త ప్రియురాలితో ఉండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా.. | Wife Catched Husband With Lover in Meerpet Hyderabad | Sakshi
Sakshi News home page

యువతితో వివాహేతర సంబంధం

Dec 27 2018 10:41 AM | Updated on Dec 27 2018 10:41 AM

Wife Catched Husband With Lover in Meerpet Hyderabad - Sakshi

మీర్‌పేట: కట్టుకున్న భార్య, కూతురిని వదిలి మరో యువతితో  వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న భర్త ప్రియురాలితో ఉండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన నాగరాజుతో అమ్యూలకు 2007లో వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. నాగరాజు టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తలు నాగరాజు, అమూల్యలు వేర్వేరుగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే నాగరాజు తాను విధులు నిర్వహిస్తున్న కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతితో 6 నెలలుగా చనువుగా ఉండడంతో అమూల్య బుధవారం హస్తినాపురం ద్వారకానగర్‌లో వారు ఉంటున్న ఇంటికి బంధువులతో కలిసి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో నాగరాజుతో యువతి కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేని అమూల్య తన బంధువులుతో కలిసి వారిపై దాడి చేసి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు మీర్‌పేట సీఐ యాదయ్య మాట్లాడుతూ గతంలోనే నాగరాజుపై సెక్షన్‌–490 కింద కేసు నమోదైందని, ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement