హత్యకు పథకం.. భార్యపై అనుమానం | Wife Arrest in Husband Murder Case Karnataka | Sakshi
Sakshi News home page

ప్రియుడితో హత్యకు పథకం

May 14 2019 12:07 PM | Updated on May 14 2019 12:07 PM

Wife Arrest in Husband Murder Case Karnataka - Sakshi

ప్రియుడితో కలిసి ఉమేశ్‌ను హత్య చేయించినట్లు

యశవంతపుర: హెగ్గనహళ్లి క్రాస్‌లో కబాబ్‌ వ్యాపారి ఉమేశ్‌ (35) హత్యకు సంబంధించి ఆయన భార్య రూప ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి ఉమేశ్‌ను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హెగ్గనహళ్లి క్రాస్‌ వద్ద ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు మారణాయుధాలతో దారుణంగా ఉమేశ్‌ను హత్య చేశారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకాకు చెందిన ఉమేశ్‌ హెగ్గనహళ్లిలో చికెన్‌ కబాబ్‌ వేస్తూ శ్రీగంథనగరలో నివాసం ఉంటున్నారు.

హత్య జరిగిన కొద్ది నిముషాల సమయంలో కిశోర్‌ అనే వ్యక్తి రూపకు ఫోన్‌ చేసి మాట్లాడారు. నీ భర్తను ముగించాం. ఇక సంతోష్‌ను ముగిస్తే నీవు నా దానివి అవుతావంటూ మాట్లాడినట్లు తెలిసింది. దీంతో కిశోర్‌ పరారీలో ఉన్నాడు. ఉమేశ్, కిశోర్‌ల మధ్య పాతకక్షలున్నట్లు తెలిసింది. అతడిని అరెస్ట్‌ చేయటానికీ డీసీపీ శశికుమార్‌ ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. సంతోష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు నిర్ణయించారు. రూప కిశోర్‌తో చనువుగు ఉన్న ప్రైవేట్‌ వీడియోలో బయటపడింది. గతంలో ప్రియుడితో కలిసి రూప అన్నను కూడ కిశోర్‌ చేత హత్య చేయించిన్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. ఇందుకు సంబంధించి రాజగోపాలనగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement