రోడ్డు ప్రమాదంలో వీ6 రిపోర్టర్‌ మృతి    | V6 Reporter Died In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వీ6 రిపోర్టర్‌ మృతి   

Apr 28 2018 11:46 AM | Updated on Aug 30 2018 4:20 PM

V6 Reporter  Died In Road Accident - Sakshi

గజ్వేల్‌/గజ్వేల్‌రూరల్‌ : ఉమ్మడి మెదక్‌ జిల్లా వీ6 న్యూస్‌ చానల్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నకుమార్‌ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల ప్రకారం..శుక్రవారం సాయంత్రం ప్రసన్న కుమార్‌ తన కారులో హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గజ్వేల్‌ మండలం కొడకండ్ల సమీపంలో అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌కు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌లో గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉన్న ప్రసన్నకుమార్‌ మృతదేహాన్ని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, తహసీల్దార్‌ నిర్మల, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల నేతలు పరిశీలించారు. ప్రసన్న కుమార్‌ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  

1
1/1

మృతదేహాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement