భార్య ప్రియుడ్ని కోర్టు కీడ్చి..

US Man Sued Wifes Lover For Failed Marriage - Sakshi

వాషింగ్టన్‌ : తమ కాపురంలో నిప్పులు పోసి తన భార్యను తనకు కాకుండా చేశాడని ఆరోపిస్తూ ఆమె ప్రియుడ్ని కోర్టు కీడ్చి రూ 5 కోట్లు రాబట్టిన భర్త ఉదంతం వాషింగ్టన్‌లో వెలుగు చూసింది. ఎప్పుడు పనితో కార్యాలయంలో గడుపుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నావని తన భార్య తనతో తరచూ వాదించేదని కెవిన్‌ హోవార్డ్‌ చెప్పుకొస్తూ ఈ క్రమంలో తన భార్యకు ఆమె ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్‌తో వివాహేతర బంధం బయటపడిందని తెలిపారు. నిత్యం ఆమె వెంట తాను ఉండటం లేదని ఫిర్యాదు చేస్తూ ఆమె తన నుంచి విడాకులు కోరుకుందని చెప్పారు.

భార్య ప్రవర్తనపై అనుమానంతో తాను ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని ఆశ్రయించగా ఆమెకు తన కొలీగ్‌తో అక్రమ సంబంధం వ్యవహారం బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భార్య ప్రియడు ఒకసారి తమ ఇంటికి వచ్చాడని, తమతో డిన్నర్‌ చేశాడని కెవిన్‌ గుర్తుచేసుకున్నారు. నిజం తెలిసిన తర్వాత గ్రీన్‌విల్లేలోని జడ్జ్‌ ఎదుట భార్య ప్రియుడిపై కెవిన్‌ దావా వేశారు. తమ వైవాహిక జీవితం బెడిసికొట్టేందుకు తన భార్య ప్రియుడే కారణమని ఆరోపించారు. కెవిన్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్ధానం బాధితుడికి రూ 5.3 కోట్ల పరిహారం చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top