ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో కలకలం రేపిన యువకుడి అరెస్ట్‌

US Man Posts Plan to Murder Women Who Rejected Him - Sakshi

వాషింగ్టన్‌ : నేను చూసిన ప్రతి అమ్మాయిని చంపడమే నా ధ్యేయం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన ఓ యువకున్ని అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. అమెరికాలోని ప్రోవో ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్‌ డబ్ల్యూ క్లిరీ అనే యువకుడు ‘ఇంపల్స్‌ కంట్రోల్‌ డిసర్డార్‌’తో బాధపడుతున్నాడు. దాంతో పాటు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలనే స్వభావం కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తన ఫేస్‌బుక్‌లో కొన్ని వివాదాస్పద పోస్టులు పెడుతూ.. అనుమానాలు రేకిత్తించాడు.

‘అతి త్వరలోనే ఎక్కువ మందిని చంపిన వ్యక్తిగా నిలవబోతున్నాను. నేను చూసిన ప్రతి అమ్మాయిని చంపడమే నా ధ్యేయం. ఎందుకంటే నాకు ఇంతవరకూ ఒక్క గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా లేదు. ఇప్పటికి నేను వర్జిన్‌నే. ఇందుకు కారణం వారు నన్ను రిజెక్ట్‌ చేయడమే. అందుకే నన్ను తిరస్కరించిన అమ్మాయిలకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. నేను చావడానికి సిద్ధమయ్యాను.  చనిపోవడానికి సిద్ధమైన వ్యక్తి కంటే ప్రమాదకరమైనది ఏదీ లేదు’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

అయితే క్లిరీ ఇలా పోస్ట్‌ చేసిన వారాంతంలోనే ప్రోవోలో ఓ భారీ మహిళా ర్యాలీ జరగనుంది. ఈ పోస్ట్‌లతో అప్రమత్తమైన పోలీసులు ఎఫ్‌బీఐ సాయంతో ట్రేస్‌ చేసి క్లిరీని అరెస్ట్‌ చేశారు. ఈ విషయం గురించి క్లిరీ తాను పోస్టులు పెట్టిన మాట వాస్తవమే అని ఒప్పుకొన్నాడు. కానీ బెదిరింపు మెసేజ్‌లు రావడంతో వెంటనే వాటిని తొలగించినట్లు తెలిపాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top