ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల మిస్సింగ్‌ | Two Doctors Go Missing In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల మిస్సింగ్‌

Dec 30 2019 4:11 PM | Updated on Dec 30 2019 5:18 PM

Two Doctors Go Missing In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తెలుగు వైద్యుల అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నెల25న  డాక్టర్‌ హిమబిందు(29), డాక్టర్‌ దిలీప్‌ సత్య(28) ఢిల్లీలో అదృశ్యమయ్యారు. కాగా హిమబిందు భర్త డా. శ్రీధర్‌ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్‌, హిమబిందు, శ్రీధర్‌ ఈ ముగ్గురు కర్నూల్‌ మెడికల్‌ కళాశాలలో కలిసి చదువుకున్నారు. చండీగఢ్‌లో  చిన్న పిల్లల వైద్యునిగా దిలీప్‌ పనిచేస్తున్నారు. ఈ నెల 24న పుదుచ్చేరిలోఇంటర్వ్యూకి వెళ్లి 25న తిరిగి వస్తుండగా ఢిల్లిలోని శ్రీధర్‌ దంపతుల ఇంట్లో ఆగారు. అనంతరం ఉదయం 11.30 నిమిషాల సమయంలో దిలీప్‌తో కలిసి చర్చికి వెళ్తున్నానని చెప్పి హిమబిందు, దిలీప్‌ బయటికి వెళ్లారు. కాసేపటి తరువాత ఇద్దరి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో బిందు భర్త శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇద్దరి ఆచూకీ కనిపెట్టాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ , ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్లను అభ్యర్థించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement