బర్త్‌డే విషాదం.. | Two boys dies due to consuming cyanide in karnataka | Sakshi
Sakshi News home page

బర్త్‌డే విషాదం.. జ్యూస్ అనుకుని సైనేడ్ తాగడంతో..

Sep 29 2017 9:15 AM | Updated on Jul 12 2019 3:37 PM

Two boys dies due to consuming cyanide in karnataka - Sakshi

మృతి చెందిన సాయిల్‌శంకర్, అర్యన్‌సింగ్‌ (ఫైల్‌)

సాక్షి, బెంగళూరు: జ్యూస్‌గా భావించి సైనేడ్‌ తాగిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన బుధవారం రాత్రి సిటీ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి... ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంకర్, సంజయ్‌సింగ్‌ కుటుంబాలు కొన్నేళ్లుగా నగరంలో నివాసం ఉంటున్నాయి. శంకర్‌ కిలారు రోడ్డులో నివాసం ఉంటుండగా, సంజయ్‌ సింగ్‌ కబ్బన్‌ పేటలో ఉంటున్నారు. శంకర్‌ బంగారు వ్యాపారి కాగా ఇతని కుమారుడు సాయిల్‌ శంకర్‌ (9). సంజయ్‌ దంపతుల కుమారుడు ఆర్యన్‌ సింగ్‌ (9). సాయిల్, ఆర్యన్‌  పుట్టిన రోజు బుధవారం కావడంతో బాలుర కుటుంబ సభ్యులు వీరి బర్త్‌డే పార్టీని శంకర్‌ నివాసంలో ఏర్పాట్లు చేశారు.

రాత్రి కేక్‌ కట్‌ చేసిన అనంతరం కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సమయంలో బంగారు ఆభరణాలకు ఉపయోగించే సైనేడ్‌ను చూసిన ఇద్దరు చిన్నారులు దానిని పొరపాలుగా జ్యూస్‌గా భావించి తాగేశారు. క్షణాల్లో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో విక్టోరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. దీంతో రెండు  కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement