ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి | Truck Van Collision In Chandrapur | Sakshi
Sakshi News home page

Dec 9 2018 8:42 AM | Updated on Dec 9 2018 8:52 AM

Truck Van Collision In Chandrapur - Sakshi

చంద్రాపూర్‌‌: మహారాష్ట్రలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్‌ జిల్లాలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి కోర్పన-వాణి రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌, ట్రక్‌లు బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న పదకొండు మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లతో పాటు వ్యాన్‌ డ్రైవర్‌ ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ట్రక్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement