4 గంటలు.. 143 కేసులు.. | Traffic police Special Drive On Road Safety Hyderabad | Sakshi
Sakshi News home page

4 గంటలు.. 143 కేసులు..

Aug 24 2018 8:21 AM | Updated on Sep 4 2018 5:53 PM

Traffic police Special Drive On Road Safety Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత ఉల్లంఘనలపై బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనాయణ్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు గంటల పాటు జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  గురువారం ఉదయం 11 నుంచి రెండు గంటల పాటు, మధ్యాహ్నం 1.30 నుంచి మరో రెండు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

వీటిలో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతున్న 44 మంది ద్విచక్ర వాహనచోదకులు, రాంగ్‌సైడ్‌లో  వాహనాలు డ్రైవ్‌ చేసుకుంటూ వస్తున్న 60 మంది, ఆటో పైలెటింగ్‌కు పాల్పడుతున్న 26 మంది, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతున్న ఏడుగురితో పాటు టు వీలర్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసు పెట్టడంతో పాటు ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంఘనులకు చెక్‌ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఉద్దేశించిన ఈ స్పెషల్‌ డ్రైవ్స్‌ కొనసాగుతాయని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనాయణ్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement