భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి | Terror Attack On Church In Burkina Faso | Sakshi
Sakshi News home page

భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి

Feb 17 2020 7:10 PM | Updated on Feb 17 2020 7:12 PM

Terror Attack On Church In Burkina Faso - Sakshi

వాగాడౌగా : ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుర్కినా ఫాసోలో ఓ చర్చిపై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఫాస్టర్‌తో సహా.. 24 మంది అమాయకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు మరికొంత మందిని దుండుగులు అపహరించుకుని పోయారని తెలుస్తోంది.  బుర్కినా ఫాసోపై ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. కాగా గడిచిన నాలుగేళ్లగా ఈ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో దాదాపు 600కుపైగా పౌరులు మృతి చెందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement