లాక్‌డౌన్‌లో టీడీపీ పేకాట శిబిరం

TDP Leaders Playing Cards Amid Lockdown - Sakshi

సాక్షి, ఏలూరు: లాక్‌డౌన్‌ను కూడా ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు టీడీపీ నాయకులు. నల్లజర్ల ప్రాంతంలో ఉన్న రిజర్వ్‌ఫారెస్ట్‌లోని జీడిమామిడి తోటలను వేదికగా చేసుకున్నారు. అక్కడ షెల్టర్‌ ఏర్పాటు చేసుకుని పేకాట కేంద్రాన్ని నడుపుతున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి నేతృత్వం వహిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ట్రైనీ డీఎస్పీ సునీల్‌కుమార్‌ నేతృత్వంలో చేసిన దాడిలో 16 మంది పట్టుబడ్డారు. వీరిలో జెడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు సోదరుడు, దగ్గర బంధువులు ఉండటం గమనార్హం. చదవండి: పేకాడుతూ పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్సీ!

గతంలో నల్లజర్లలోని పేకాట శిబిరంపై దాడి చేసినందుకు అప్పటి రూరల్‌ సీఐగా పనిచేసిన రాజశేఖర్‌పై సస్పెన్షన్‌ వేటు వేయించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో పేకాట శిబిరాలను మూయించేసింది. దీంతో రిజర్వ్‌ఫారెస్ట్‌లో జీడిమామిడి తోటలను వేదికగా చేసుకుని ఈ శిబిరాలు నడుస్తున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లలో అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్లు పెట్టుకుని రాత్రింబవళ్లు ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. చదవండి: ప్రేమను నిరాకరించిందని.. రూ.3 లక్షలతో హత్యకు డీల్ 

16 మంది అరెస్ట్‌ 
పోలీసులు జరిపిన దాడిలో 16 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు.  వీరిపై ఎపీ గేమింగ్‌ యాక్ట్‌తో పాటు కోవిడ్‌ సందర్భంగా జిల్లాలో ఉన్న 144 సెక్షన్‌ ఉల్లంఘన, కోవిడ్‌ను స్ప్రెడ్‌ చేసే అవకాశం ఉండటంతో ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో బాపిరాజు తమ్ముడు ముళ్లపూడి సత్య సురేంద్ర, ఆయన దగ్గర బంధువు ముళ్లపూడి కృష్ణమూర్తితో పాటు, కొండేపూడి నిరంజన్‌కుమార్, కోడూరి నారాయణరావు, కూచిపూడి శివరామకృష్ణ, గంటా భీమేశ్వరరావు, చింతా శ్రీకృష్ణ చైతన్య, వేగి ప్రతాప్, చుండ్రు సురేష్‌, బోడేపూడి శ్రీనివాస్, వక్కలపూడి సత్యనారాయణ, గుంటుముక్కల వేణు, మల్లిపూడి కృష్ణమూర్తి, చిక్కా శ్రీనివాసరావు, నాదెళ్ల శ్రీనివాస్, చుండ్రు ధర్మారావు, నాదెళ్ల సురేంద్ర ఉన్నారు. వీరి నుంచి 1,06,810 రూపాయలు, ఐదు కార్లు, పది సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.  చదవండి: నాగబాబుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top