ప్రేమను నిరాకరించిందని.. రూ.3 లక్షలతో హత్యకు డీల్

Plan To Assassination Young Woman In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: తనను ప్రేమించలేదనే కోపంతో యువతిని హత్య చేయాలని భావించాడు ఓ యువకుడు. వివరాల్లోకెళ్తే.. ఎం నాగులాపల్లికి చెందిన యువతిని సత్యదేవ్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. సత్యదేవ్‌ ప్రేమని ఆ యువతి  నిరాకరించడంతో తన స్నేహితులతో కలిసి హత్య చేయడానికి ప్లాన్‌ సిద్ధం చేశాడు. ఏలూరుకు చెందిన కొత్తపల్లి సురేష్‌తో కలిసి రూ.3 లక్షల సుపారీతో ఆ యువతి హత్యకు డీల్‌ కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా అడ్వాన్స్‌ కింద రూ.40 వేలు తీసుకుంటున్న క్రమంలో ముగ్గురు నిందితుల్ని ద్వారకా తిరుమల పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

చదవండి: వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top