అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సుమో | Tata Sumo Rollovered in Home And Man Dead | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సుమో

Jun 10 2019 11:56 AM | Updated on Jun 10 2019 11:56 AM

Tata Sumo Rollovered in Home And Man Dead - Sakshi

ఇంట్లోకి దూసుకెళ్లిన సుమో (ఇన్‌సెట్‌లో) వెంకటేశులు

పిచ్చాటూరు : అదుపుతప్పి టాటా సుమో ఇంట్లోకి దూసుకెళ్లి కల్లుగీత కార్మికుడు దుర్మరణం పాలైన సంఘటన మండలంలోని పులికుండ్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామాంజనేయులు కథనం మేరకు.. ఆదివారం వేకువజామున 4.20 గంటల సమయంలో టీఎన్‌ 07బీసీ 6341 నంబరు టాటా సుమో మహిళలను ఎక్కించుకుని శ్రీపెరంబదూరులోని కంపెనీకి బయలుదేరింది. ఈ క్రమంలో వాహనం పులికుండ్రం చెక్‌పోస్టు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న వెంకటేశులు ఇంటిపైకి దూసుకెళ్లింది. ఇంటి బాత్‌రూమ్, ఇంటి వాకిలిని ఢీకొని ఆగింది. హఠాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వచ్చి చూడగా, కల్లుగీత పనికి సమాయత్తమవుతున్న వెంకటేశులు వాహనం కింద రక్తగాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని, వెంకటేశులు(56) మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడు రాజేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement