బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి | Take Actions On The Blackmailer | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి

Jul 19 2018 9:27 AM | Updated on Nov 9 2018 4:31 PM

Take Actions On The Blackmailer - Sakshi

 వినతిపత్రం ఇస్తున్న విద్యార్థి నాయకులు   

మెదక్‌ మున్సిపాలిటీ : బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చెప్పుకుంటూ అధికారులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న రఘుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓకు మెమోరాండాం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు రమేశ్‌ మాట్లాడుతూ గతంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రఘు ప్రైవేట్‌ విద్యా సంస్థలు, వార్డెన్లను బ్లాక్‌ మెయిల్‌చేస్తూ డబ్బులు వసూలు చేశాడన్నారు.

ఈ విషయాన్ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లగా గతంలోనే రఘును అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జరిగిందన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడి చెప్పుకుంటూ మళ్లీ బ్లాక్‌ మెయిల్స్‌ పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో రఘుపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు మెమోరాండాం సమర్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, పృథ్వి, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు శరత్‌ కుమార్, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు వినోద్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నీలంబాబుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement