కర్నూలులో ఘోర ప్రమాదం | Sylinders Blast In Auto In Kurnool District | Sakshi
Sakshi News home page

పేలిన సిలిండర్లు.. ఇద్దరి మృతి

Apr 20 2019 6:06 PM | Updated on Apr 20 2019 6:22 PM

Sylinders Blast In Auto In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలోని వక్కరవాగు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ధాటికి ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఇంకొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎండవేడి కారణంగా సిలిండర్లు పేలి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆటోడ్రైవర్‌ పేరు రషీద్‌ అని తెలిసింది. సోడా షాపులకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement