అందరి ముందు బట్టలు విప్పించి.. | Student Commits Suicide In Ludhiana At Punjab | Sakshi
Sakshi News home page

టైతో కట్టేసి దారుణంగా శిక్షించారు.. అందుకే

Dec 1 2019 11:42 AM | Updated on Dec 1 2019 2:38 PM

Student Commits Suicide In Ludhiana At Punjab - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లూథియానా: టీచర్‌ కొట్టాడని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్‌లోని లుధియానాలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని లుధియానా గురుమేల్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన బిర్క్‌రాజ్‌ తివారికి ఓ కుమారుడు ఉన్నాడు. అతను స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఓ రోజు నిక్కరు ధరించి కాలేజీకి వెళ్లడంపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా సదరు విద్యార్థిని శిక్షించమని ఆదేశించాడు. దీంతో ఆ టీచర్‌ విద్యార్థి చేతులను టైతో కట్టేసి వరుసగా చెంపదెబ్బలు కొడుతూ దారుణంగా శిక్షించాడు. నిక్కరు ధరించినందుకు అందరి ముందు దుస్తులు విప్పించి అవమానపర్చాడు.

దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి గురువారం అర్థరాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌ విషాదం వ్యక్తం చేశారు. లోతైన దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement