సినిమాల ప్రభావంతో రెచ్చిపోతున్నారు | Sri Dharani Murder Case Accused Sent to Police Custody | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కస్టడీకి శ్రీధరణి హత్య కేసు నిందితులు

Mar 9 2019 8:37 AM | Updated on Mar 9 2019 8:37 AM

Sri Dharani Murder Case Accused Sent to Police Custody - Sakshi

పశ్చిమగోదావరి: సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసులో నిందితులను శుక్రవారం పోలీస్‌ కస్టడీకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఏడు రోజులు పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించిందన్నారు.   నిందితులు 32 కేసుల్లో ఉన్నారని, అయితే ఏడు కేసులు నమోదయ్యాయన్నారు. పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో కేసులు ఉన్నాయని, నిందితుల నుంచి అన్ని కేసులకు సంబంధించి  వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్‌ చేస్తామని, వారు కేసుల నుంచి  తప్పించుకోకుండా అన్ని సాక్షాధారాలతో పాటు సాంకేతిక ఆధారాలు కూడా సేకరిస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశామన్నారు. యువతలు ఒంటరి ప్రాంతాలకు వెళ్లరాదని, దీనిపై తల్లితండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సినిమాల ప్రభావంతో దుండగులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. యువతులపై అత్యాచారం జరిగితే చెప్పుకోలేని స్థితిలో ఉండటం వల్ల దీనిని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement