అశ్లీల చిత్రాల వీక్షణ: రాజకీయ నేతల విచారణ!

Several Political Leaders Booked For Seen Child Abuse Videos Among Trich - Sakshi

తిరుచ్చిలో రాజకీయ నేతలు సహా 30 మంది వద్ద విచారణ  

చెన్నై, చెంగల్పట్టులలో తనిఖీలు  

సాక్షి, చెన్నై : ఇంటర్‌నెట్‌లో అశ్లీల చిత్రాలు చూస్తున్న రాజకీయ నేతలు సహా 30 మంది వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.  ఇంటర్‌నెట్‌లో బాలబాలికల లైంగిక వీడియోల డౌన్‌లోడ్, షేర్‌ చేయడం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రథమస్థానంలో ఉన్నట్లు అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ఇటీవల సమాచారం అందింది. దీనిని రాష్ట్ర పోలీసులకు పంపిన కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలకు నిరోధించే విభాగం అడిషనల్‌ డీజీపీ రవి కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. 

రాష్ట్రంలో అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి వీక్షించే వారి ఐపీ అడ్రస్సులు తమ వద్ద ఉన్నాయని,  త్వరలో వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో సెల్‌ ఫోన్‌లలో అశ్లీల చిత్రాలను, వీడియోలను వీక్షించే వారి మధ్య కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో తిరుచ్చిలో బాలికల అసభ్య వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి స్నేహితులకు షేర్‌ చేసిన నేరానికి తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్‌ అనే యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు.  తిరుచ్చి పాలకరై ఖాజాపేట కొత్త వీధికి చెందిన ఇతను ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. క్రిష్టోఫర్‌ ఐపీ అడ్రస్‌ ఆధారంగా తిరుచ్చి కంటోన్మెంట్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి పోలీసు కమిషనర్‌ వరదరాజు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కమిషనర్‌ మణికంఠన్, ఇన్‌స్పెక్టర్‌ ఆనంద వేదవల్లి... క్రిష్టోఫర్‌ వద్ద తీవ్ర విచారణ జరిపి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. క్రిష్టోఫర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు.

చదవండిఅశ్లీల వీడియోల షేరింగ్‌ వ్యక్తి అరెస్టు

కాగా గత నాలుగేళ్లుగా క్రిష్టోఫర్‌ ఈ పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం. అతని వద్ద నుంచి 150 ఫేస్‌బుక్, వాట్సాప్, ఇంటర్‌నెట్‌ స్నేహితులు టచ్‌లో వున్నట్లు తెలిసింది. 42 ఏళ్ల క్రిష్టోఫర్‌ ఈ వీడియోలను వీక్షించడంతో మానసిక రోగిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అతడి ఫోన్, మెమెరీ కార్డులను చెన్నైలోని  ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. దీనికి సంబంధించిన నివేదిక అందగానే విచారణ తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. 

కిష్ట్రోఫర్‌ 150 మంది స్నేహితుల జాబితాలను తిరుచ్చి – చెన్నై, చెంగల్పట్టు, కోవై జిల్లాల పోలీసులకు తిరుచ్చి పోలీసులు పంపారు. ఈ జిల్లాలోని స్నేహితుల వద్ద విచారణ జరుగుతోంది. తిరుచ్చిలో రాజకీయ ప్రముఖులు, స్నేహితులు సహా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం క్రిష్టోఫర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక రాష్ట్రంలో అశ్లీల వీడియోలను చూసే వారిని పోక్సో చట్టంలో అరెస్టు చేయడం ఇదే ప్రప్రథమం.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top