కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆపై

Senior Assistant In Bhimavaram Molest Woman Case Registered - Sakshi

సాక్షి, భీమవరం : కామాంధుడి మాయమాటలకు ఓ యువతి మోసపోయింది. నమ్మి వెంటవెళ్లినందుకు లైంగిక దాడికి గురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. నర్సాపురంలోని ఐడియా షోరూంలో పనిచేసే యువతి (19)కి స్థానికంగా నివాసముండే డేగల రాంబాబు పరిచయమయ్యాడు. ఓ ముఖ్యమైన పనుందని చెప్పి గత ఆగస్టులో భీమవరంలోని మౌనిక నివాసానికి తీసుకెళ్లాడు. యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా వీడియో తీసి యువతిని గత కొంతకాలంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి భీమవరం పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. రాంబాబు సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అతని సొంతూరు ఏనుగువాని లంక అని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top