పెళ్లి కూతురితో సెల్ఫీ.. రచ్చ రచ్చ

Selfie with Bride Create rucks in Kanpur - Sakshi

లక్నో : వివాహ వేడుక ఘనంగా జరిగింది. వధువువరులిద్దరూ వేదికపై బంధువులతో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదుగానీ ఓ వ్యక్తి ఆ ఫంక్షన్‌ హాల్‌ను రణరంగంగా మార్చిపడేశాడు. యూపీలోని కాన్పూర్‌లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... 

బర్రా ప్రాంతానికి చెందిన ఓ జంట స్థానికంగా ఓ ఫంక్షన్‌ హాల్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడే రిసెప్షన్‌ నిర్వహించగా.. నవ వధువరులతో బంధువులంతా ఒక్కోక్కరుగా ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వేదికపైకి ఎక్కి వధువుతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. అతనెవరో తెలీక వధువు కంగారు పడింది. ఇంతలో వరుడి తరపు బంధువులు అ యువకుడిని కిందకి లాగి కొట్టారు. 

ఇంతలో వధువు తండ్రి వారిని వారించే యత్నం చేశాడు. అది గమనించిన పెండ్లి కొడుకు వధువు తండ్రిపై చెయ్యి చేసుకున్నాడు. తన తండ్రిపై దాడిని చూసిన వధువు.. పెండ్లి కొడుకుపై చెయ్యి చేసుకుంది. ఆ ఘర్షణలో మరో మహిళ చెప్పు దెబ్బలతో వారిపై విరుచుకుపడింది. ఘటనకు సంబంధించిన ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు అందినట్లు బర్రా పోలీసులు వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top