breaking news
rucks
-
బెంగాల్ అసెంబ్లీలో రగడ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసనసభ రణరంగాన్ని తలపించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ సభ్యుల మధ్య గురువారం తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ దాడులను ఖండిస్తూ తీర్మానం ఆమోదించాలని పట్టుబట్టారు. తీర్మానంపై తొలుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. బీజేపీ తీరుపై విరచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ ప్రజలపై కక్షగట్టారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బెంగాలీతోపాటు ఇతర భాషలను వారు వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీ అవినీతి పార్టీ, దొంగల పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. ఓట్ల దొంగతనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలపై సీఐఎస్ఎఫ్ జవాన్లను ఉసిగొల్పిందని అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని నామరూపాల్లేకుండా చేయాలని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వారిని హెచ్చరిస్తూ మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సభలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉండని రోజు వస్తుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని తేల్చిచెప్పారు. ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి కూలదోస్తారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై జరుగుతున్న అరాచకాలపై అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ సభ్యులకు భయమెందుకని ప్రశ్నించారు. దాంతో సభలో అలజడి మొదలైంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకున్నారు. ఓట్ల దొంగ బీజేపీ అంటూ తృణమూల్ కాంగ్రెస్, ఉద్యోగాల దొంగ తృణమూల్ కాంగ్రెస్ అంటూ బీజేపీ సభ్యులు నినదించారు. నీళ్ల సీసాలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సభలో సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. বাংলাকে চেনে না #mamatabanerjee #tmcnews #westbengalassembly #assemblynews #bjpnews #tmcvsbjp pic.twitter.com/89YF5SqK04— The Wall (@TheWallTweets) September 4, 2025బీజేపీ సభ్యుల సస్పెన్షన్ సభలో పరిస్థితి అదుపు తప్పడంతో బీజేపీ చీఫ్ విప్ డాక్టర్ శంకర్ ఘోష్‌ను సభ నుంచి రోజంతా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ బీమన్ బెనర్జీ ప్రకటించారు. మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు. తమ పార్టీ చీఫ్ విప్ సస్పెన్షన్ పట్ల బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జైశ్రీరామ్ అని నినదిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. బయటకు వెళ్లేందుకు నిరాకరించిన శంకర్ ఘోష్‌ను మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. బీజేపీ సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, బెంగాలీ వలస కార్మికుల హక్కులు, భద్రతపై జరుగుతున్న కీలకమైన చర్చను అడ్డుకొనేందుకు ప్రయతి్నస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మిహీర్ గోస్వామి, బంకీం ఘోష్, అశోక్ దిండాను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా, విపక్ష సభ్యుల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ మందలించారు. పద్ధతి మార్చుకోకపోతే మమ్మిల్ని కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు గూండాల మాదిరిగా వ్యవహరించారని తప్పుపట్టారు.VIDEO | Kolkata: West Bengal BJP Chief Whip Sankar Ghosh fainted and was rushed to hospital, while he was being marshalled out of Assembly after he refused to leave following suspension from House.West Bengal Assembly LoP Suvendu Adhikari (@SuvenduWB) says, “These marshals and… pic.twitter.com/8EiXjUPcgo— Press Trust of India (@PTI_News) September 4, 2025 -
మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం
మాచర్ల: కండీషన్ బెయిల్ పేరుతో టీడీపీ నేతలు మాచర్లలో అలజడి సృష్టించేందుకు మరోమారు విఫలయత్నం చేశారు. గత నెల 16వ తేదీన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం పేరుతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి 12వ వార్డులో ర్యాలీగా వెళ్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి ముగ్గురిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి మరో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న నిందితులందరూ కండీషన్ బెయిల్‌కు సంబంధించి పట్టణ పోలీసు స్టేషన్లో సంతకాలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆదివారం సంతకాలు చేసేందుకు బ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు వస్తున్న నేపథ్యంలో అలజడి సృష్టించాలని వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా మాచర్లకు తరలి రావాలంటూ వారి అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు 30 యాక్టు, 144 సెక్షన్ అమలు చేస్తూ నెహ్రూనగర్ నుంచి పట్టణ పోలీసు స్టేషన్ వరకు గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్, సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దీంతో ఇతరులు అక్కడికి వచ్చి అలజడి సృష్టించే అవకాశం లేకపోయింది. కేవలం బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే 12.30 గంటలకు బస్సులోంచి చేతులూపుతూ వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయిన మహిళ
-
‘జోహార్ ఎన్టీఆర్’ అన్నంత మాత్రానా మీ పాపం పోదు
సాక్షి, అమరావతి: సమస్యేంటో చెబితేనే స్పీకర్‌కు కూడా ఆలోచించే వీలు ఉంటుందని, అసలు వాళ్ల సమస్యేంటో వాళ్లకే తెలియడం లేదని టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే.. టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో.. మంత్రి అంబటి జోక్యం చేసుకుని.. అసలు టీడీపీ సభ్యులు ఎందుకు పోడియం దగ్గరకు ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కేవలం చంద్రబాబు ట్రైనింగ్‌లోనే వీళ్లంతా ఇలా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. ప్రతీరోజూ ఇలాగే చేస్తున్నారని, ఇవాళ త్వరగా సస్పెండ్ చేయించుకుని ఇళ్లకు వెళ్లాలని టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. స్పీకర్ అవకాశం ఇస్తున్నా వినడం లేదని.. తమ స్థానాల్లో ఉండి సమస్యేంటో ప్రశాంతంగా చెబితేనే విషయం అందరికీ అర్థం అవుతుందని టీడీపీ సభ్యులకు హితవు పలికారాయన. దివంగత ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ సభ్యులకు లేదని.. ఎన్టీఆర్ పక్షాన ఉన్న ఒక్క బుచ్చయ్య చౌదరికి మాత్రమే హక్కు ఉందని, మిగతా వాళ్లంతా చంద్రబాబు వెంట చేరి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన బాపతేనని అంబటి స్పష్టం చేశారు. ఈ క్రమంలో జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో టీడీపీ సభ్యులు గోల చేయగా.. ఎన్టీఆర్ జోహార్ అన్నంత మాత్రానా చేసిన పాపం పోదని పేర్కొన్నారు మంత్రి అంబటి. ఇదీ చదవండి: తప్పు బాబుదైనా...నెట్టేస్తే సరి!! -
పెళ్లి కూతురితో సెల్ఫీ.. రచ్చ రచ్చ
లక్నో : వివాహ వేడుక ఘనంగా జరిగింది. వధువువరులిద్దరూ వేదికపై బంధువులతో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదుగానీ ఓ వ్యక్తి ఆ ఫంక్షన్ హాల్‌ను రణరంగంగా మార్చిపడేశాడు. యూపీలోని కాన్పూర్‌లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... బర్రా ప్రాంతానికి చెందిన ఓ జంట స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడే రిసెప్షన్ నిర్వహించగా.. నవ వధువరులతో బంధువులంతా ఒక్కోక్కరుగా ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వేదికపైకి ఎక్కి వధువుతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. అతనెవరో తెలీక వధువు కంగారు పడింది. ఇంతలో వరుడి తరపు బంధువులు అ యువకుడిని కిందకి లాగి కొట్టారు. ఇంతలో వధువు తండ్రి వారిని వారించే యత్నం చేశాడు. అది గమనించిన పెండ్లి కొడుకు వధువు తండ్రిపై చెయ్యి చేసుకున్నాడు. తన తండ్రిపై దాడిని చూసిన వధువు.. పెండ్లి కొడుకుపై చెయ్యి చేసుకుంది. ఆ ఘర్షణలో మరో మహిళ చెప్పు దెబ్బలతో వారిపై విరుచుకుపడింది. ఘటనకు సంబంధించిన ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు అందినట్లు బర్రా పోలీసులు వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. -
పెళ్లి కూతురితో సెల్ఫీ.. రచ్చ రచ్చ
-
మద్యం మత్తులో మహిళ హల్ చల్
వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ మహిళ మద్యం మత్తులో బుధవారం హల్ చల్ సృష్టించింది. రోడ్డు పై వెళ్తున్న వారి పై ఇష్టం వచ్చినట్టుగా రాళ్లతో దాడి చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సదరు మహిళను తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.