ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్య | SBI Deputy Manager Committed Suicide In Guntur | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్య

Oct 1 2019 12:05 PM | Updated on Oct 1 2019 12:11 PM

SBI Deputy Manager Committed Suicide In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : తెనాలిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజర్‌ అంకిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలల క్రితమేతెనాలి బ్రాంచ్‌లో చేరిన అంకిరెడ్డి.. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. 

అంకిరెడ్డి మృతిపై కుటుంబీకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. బ్యాంకు అధికారుల వేధింపుల వల్లే తన భర్త మృతి చెందారని అంకి రెడ్డి భార్య చెబుతుండగా.. భార్య, అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement