బెంగళూరు రౌడీషీటర్‌ దారుణ హత్య | Rowdy Sheeter Murdered in Karnataka | Sakshi
Sakshi News home page

బెంగళూరు రౌడీషీటర్‌ దారుణ హత్య

Mar 13 2019 12:19 PM | Updated on Mar 13 2019 12:19 PM

Rowdy Sheeter Murdered in Karnataka - Sakshi

ఇస్మాయిల్‌ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొంటున్న పోలీసులు

కెలమంగలం: బెంగళూరులోని బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ ఇస్మాయిల్‌ మంగళవారం ఉదయం క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోటలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇస్మాయిల్‌పై బొమ్మనహళ్లి ప్రాంతంలో మూడు హత్య కేసులు ఉన్నట్లు, ఇతన్ని రౌడీïషీటర్‌గా కర్ణాటక పోలీసులు ప్రకటించినట్లు డెంకణీకోట డీఎస్పీ సంగీత తెలిపారు. ఇతడు డెంకణీకోటలోని ఏవిఎస్‌ లేఔట్‌లో ఉన్న స్నేహితుడు నజీర్‌ను కలిసేందుకు కారులో రాగా, మరోకారులో వెంటాడుతూ వచ్చిన ఏడుమంది దుండగులు ఇస్మాయిల్‌ను అడ్డుకుని కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.

ఇస్మాయిల్‌ తన మిత్రుని  ఇంట్లోనికి వెళ్లగానే ముఖానికి ముసుగులు ధరించిన దుండగులు లోపలికి చొరబడి అతన్ని హత్య చేసి, కారులో వెళ్లిపోయారని పలువురు ప్రత్యక్ష  సాక్షులు పోలీసులకు తెలిపారు. డీఎస్పీ సంగీత నేతృత్వంలో హంతకులను పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇస్మాయిల్‌ మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. పాత కక్షలే హత్యకు కారణం కావచ్చని భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement