పాపవినాశనం వద్ద రోడ్డు ప్రమాదం | Road Accident At Papavinasam in Tirumala | Sakshi
Sakshi News home page

పాపవినాశనం వద్ద రోడ్డు ప్రమాదం

Jan 5 2018 3:23 PM | Updated on Aug 30 2018 4:17 PM

సాక్షి, తిరుమల : తిరుమలలోని పాపవినాశం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాపవినాశ నుంచి వస్తున్న జీపు , ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. జీపు డ్రైవర్ అతివేగం కారణంగానే  ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement