మేడ్చల్‌లో రెండు కార్లు ఢీ

road accident in medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌: సంక్రాంతి పండుగరోజు మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కీసరం మండలం రాంపల్లి క్రాస్‌రోడ్డు దగ్గర ఆదివారం ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక కారులో ప్రయాణిస్తున్న కరీంగూడకు చెందిన ఓమ్‌ప్రకాష్‌రెడ్డి (24), అఖిలేష్‌రెడ్డి(23) తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘఠన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Back to Top