కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident At Kurnool District Halaharvi - Sakshi

కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం మండలం హాలహర్వి బస్టాప్‌ వద్ద నిలిచి ఉన్న అయిల్‌ ట్యాంకర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. బాధితులు కర్ణాటక రాయచూర్‌ జిల్లాలోని ఎరిగేరి దర్గా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పడంతో ఈ ప్రమదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top