ఘోరం: కవల పిల్లల్ని చంపి ఆపై కారులో.. | Relative Killed Two Mental Disabilities Children | Sakshi
Sakshi News home page

ఘోరం: మేనమమే కాలయముడై..

Jun 16 2018 7:03 AM | Updated on Sep 4 2018 5:07 PM

Relative Killed Two Mental Disabilities Children - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరి మానసిక దివ్యాంగులను మేనమామే హత్యచేశాడు. ఇద్దరు కూడా 12 ఏళ్లలోపు కవలలు కావడం గమనార్హం. ఈ ఘటన చైతన్యపురి పోలీసు పరిధిలోని సత్యనారాయణపురం జరిగింది. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సృజన(12), విష్ణువర్దన్‌ రెడ్డి(12)లుగా గుర్తించారు. 

మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస రెడ్డి, లక్ష్మీ దంపతుల పిల్లలుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీ తమ్ముడు మల్లికార్జున రెడ్డి మిర్యాలగూడకు వెళ్లారు. పిల్లలకు స్విమింగ్‌ నేర్పిస్తా అని చెప్పి ఆ కలలను తన కారులో హైదరాబాద్‌లోని సత్యనారయణపురంలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లొకి తీసుకొచ్చారు.

శుక్రవారం రాత్రి పిల్లలిద్దరిని గొంతు నులిపి చంపేశారు. అనంతరం మరో ఇద్దరితో కలిసి మృత దేహాలను కారులో తరలించడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి ఇంటి యజమాని బయటకు వచ్చి చూడగా కారులో మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారితో చెప్పి వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

ప్రస్తుతం నిందితులను చైతన్యపురి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా పిల్లల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులకు తెలిసే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement