టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై ఎర్రచందనం స‍్మగ‍్లర‍్ల దాడి | redsandal smaggelrs attack | Sakshi
Sakshi News home page

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై ఎర్రచందనం స‍్మగ‍్లర‍్ల దాడి

Jan 2 2018 9:16 AM | Updated on Oct 2 2018 2:30 PM

సాక్షి, తిరుపతి: శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. మంగళవారం వేకువజామున శ్రీవారి పాదాల సమీపంలో సిబ్బందిపై కత్తులు, రాళ్ళతో దాడికి తెగబడ్డారు. దీంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

దాడి నుంచి తప్పించుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటనా స్థలంలో 29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement