కూతురిపై రేప్‌ : కోర్టులోనే భార్య హత్య | Rape-accused father kills wife in court | Sakshi
Sakshi News home page

కూతురిపై రేప్‌ : కోర్టులోనే భార్య హత్య

Jun 16 2018 12:41 PM | Updated on Jul 28 2018 8:53 PM

Rape-accused father kills wife in court - Sakshi


గువహటి:  మనిషిలోని  కర్కశానికి, మృగత్వానికి ప్రతీకగా నిలిచిన ఉదంతమిది. ఒకపుడు కన్నూమిన్నూ గానకుండా కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.   కేసు పెట్టిందన్న అక్కసుతో ఇపుడు ఏకంగా భార్యను హత‍్య చేశాడు.  మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు,ఇతరులు అందరూ అక్కడ ఉండగానే పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.  డిబ్రూగఢ్ జిల్లాలోని  సెషన్స్ కోర్టు ప్రాంగణంలో ఈ  సంఘటన చోటు చేసుకుంది.   

డిబ్రూగఢ్ డీఎస్‌పీ  ప్రదీప్‌ సైకియా అందించిన సమాచారం  ప్రకారం నిందితుడు పూర్ణ నహర్‌ డేకా  కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇటీవల బెయిల్‌ పై విడుదలయ్యాడు.  ఈ కేసులో ఫిర్యాదుదారుగా అతని భార్య   రీటా నహర్ దేకా కోర్టు హాజరైంది. అకస్మాత్తుగా  నిందితుడు భార్యపై దాడిచేశాడు. జేబులో నుంచి కత్తితీసి  గొంతు కోశాడు.  వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు  వైద్యులు ప్రకటించారన్నారు.  ఈయ కేసులో నిందితుడు  తొమ్మిది నెలలపాటు  జైలులో ఉన్నాడనీ, కొన్ని రోజుల క్రితం  బెయిల్‌పై  విడుదలయ్యాడరి డిబ్రూగఢ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ సిధేశ్వర్ బోరాహ్  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement