యువతులను వేధిస్తున్న సైకో అరెస్ట్‌

Psycho Who Trapping Ladies Was Arrested In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : సోషల్‌ మీడియా ద్వారా మహిళలను, యువతులను వేధిస్తున్న సైకోనూ నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. నల్గొండకు చెందిన ఒక యువకుడు యువతుల పట్ల కరుడుగట్టిన సైకోలా మారాడు. వంద మందికి పైగా మహిళలు, యువతులకు ఫోన్‌కాల్స్‌ చేసి బెదిరించేవాడు. అంతేగాక వీడియో కాలింగ్‌ను రికార్డ్‌ చేసి మార్ఫింగ్‌ చేసేవాడు. అనంతరం యువతులకు, మహిళలకు ఫోన్‌ చేసి లైంగికంగా లొంగకపోతే ఆ వీడియోలన్నింటిని తన స్నేహితులకు పంపిస్తానటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. తాజాగా సైకో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి నల్గొండ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు సైకోనూ అరెస్ట్‌ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top