మతి స్థిమితం లేని వ్యక్తి వీరంగం | Phsyco Person Stone Attack on Cars | Sakshi
Sakshi News home page

మతి స్థిమితం లేని వ్యక్తి వీరంగం

Feb 14 2019 11:20 AM | Updated on Feb 14 2019 11:20 AM

Phsyco Person Stone Attack on Cars - Sakshi

ధ్వంసమైన కారు , బంటి కుమార్‌

శామీర్‌పేట్‌: మతి స్థిమితం లేని వ్యక్తి శామీర్‌పేటలో బీభత్సం సృష్టించాడు. నల్సార్‌ దారిలో వచ్చిపోయే వాహనాలతో పాటు ప్రయాణీకులపై రాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ఘోరక్‌పూర్‌ జిల్లా, బడ్‌గావా గ్రామానికి చెందిన బంటికుమార్‌ బతుకుదెరువు నిమిత్తం స్నేహితులతో కలిసి వారం రోజుల క్రితం మండల పరిధిలోని పూడురు గ్రామానికి వలస వచ్చి స్థానిక రిలయన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

బుధవారం ఉదయం అతను శామీర్‌పేట గ్రామపరిధిలోని  నల్సార్‌ దారిలో నిలబడి వాహనాలతో పాటు ప్రయాణికులపై రాళ్లతో దాడికి దిగాడు. ఈ దాడిలో మజీద్‌పూర్‌ గ్రామానికి  చెందిన రాము, పూడూరు గ్రామానికి చెందిన పోచయ్య, మల్లేష్‌లతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 5 మందికి స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ టిప్పర్,  ఒక బ్రిజా కారు, మరో ఇన్నోవా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.  శామీర్‌పేట ఎస్‌ఐ అబ్దుల్‌ రజాక్‌ సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement