ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తా  | Person Gives Warning To Women Attacking With Acid In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తా 

Nov 10 2019 8:47 AM | Updated on Nov 10 2019 11:07 AM

Person Gives Warning To Women Attacking With Acid In Hyderabad - Sakshi

సాక్షి, గౌతంనగర్‌ : తనను ప్రేమించాలని ఓ యువతిని వేధించడమే కాకుండా ఆమె ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరిస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు శనివారం  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ హరీష్‌ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీకి చెందిన సంగ శ్రీనివాస్‌(25) ప్రైవేటు ఉద్యోగి. కాగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఓ యువతి(20)ని కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని,  లేకపోతే నీ కుటుంబ సభ్యులను యాసిడ్‌పోసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ యువతి ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్ళి బెదిరింపులు చేయడంతో యువతి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్‌ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement