రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ మృతి | Pastor Died In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ మృతి

Apr 2 2018 12:08 PM | Updated on Aug 30 2018 4:20 PM

Pastor Died In Road Accident - Sakshi

సంఘటన స్థలంలో రాజు మృతదేహం 

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని కొత్తూర్‌(బి) ట్రైడెంట్‌ చెక్కెర కర్మగారం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిచరాగడికి చెందిన పాస్టర్‌ మృతి చెందినట్లు జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ. శ్రీకాంత్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..కోహీర్‌ మండలం పిచరాగడికి చెందిన  పసుల రాజు(45) న్యాల్‌కల్‌ మండలంలోని గంగ్వార్‌ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఆదివారం గంగ్వార్‌ నుంచి పిచరాగడికి మోటారు సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో కొత్తూర్‌(బి) ట్రైడెంట్‌ కర్మాగారం గేటు ముందు కల్వర్ట వద్ద గుర్తు తెలియని వాహనం అతడి మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన పాస్టర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ. శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement