పార్టీ అధ్యక్షుడిగా అనర్హుడు..సుప్రీం తీర్పు

Pakistan SC disqualifies Sharif as PML-N chief  - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(నవాజ్‌) పార్టీ అధ్యక్షుడిగా అనర్హుడు అంటూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. పార్టీ అధినేతగా ఆయన తీసుకున్న నిర్ణయాలు శూన్యమైనవని, పనికి రానివని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సకిబ్‌ నిస్సార్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

పార్టీ అధ్యక్షుడిగా షరీఫ్‌ ఎవరికైనా టిక్కెట్లు కేటాయించడం చట్టవిరుద్ధం కిందకు వస్తుందని తెలిపారు. ఎలక్షన్‌ యాక్ట్‌-2017 ప్రకారం షరీష్‌ పార్టీ అధ్యక్షుడిగా అనర్హుడని పేర్కొంది. పనామా పేపర్స్‌ కుంభకోణంలో నవాజ్‌ షరీఫ్‌ పేరు బయటికి రావడంతో ఆయన లండన్‌ పారిపోయిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉండి పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top