ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

సాక్షి, మిడుతూరు(కర్నూలు): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపీనాథ్ తెలిపిన వివరాలు.. జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ, హుసేన్, ఫయాజ్ ద్విచక్రవాహనంపై అలగనూరు గ్రామానికి వివాహానికి వెళ్లారు. శుభకార్యం ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరారు. సుంకేసుల బాట సమీపంలోకి రాగానే బళ్లారి నుంచి జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో మహమ్మద్ రఫీ(17) అక్కడికక్కడే మృతిచెందగా, హుసేన్, ఫయాజ్ గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి మహమ్మద్ హుసేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి