భవనంపై నుంచి పడి వృద్ధురాలు మృతి | old woman died felt from the building | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి వృద్ధురాలు మృతి

Jan 21 2018 6:14 PM | Updated on Oct 1 2018 6:22 PM

సాక్షి, మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నెం కోటయ్య భార్య విష్ణుప్రియ (65) తన ఇంటి పైనుంచి కిందపడి మృతిచెందింది. పై అంతస్తుకు వెళ్లిన ఆమె అక్కడినుంచి జారి కింద పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో గమనించిన కింది పోర్షన్‌లో అద్దెకు ఉండేవాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. బంధువులను పిలిపించి కేసు నమోదు చేశారు. ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్‌ వస్తుంటాయని మృతురాలి కొడుకు తెలిపాడు. 

Advertisement
 
Advertisement
Advertisement