బాలికతో అసభ్య ప్రవర్తన .. నిందితుడికి జైలు

Old Man Arrest in Molestation on Girl Child Case Hyderabad - Sakshi

లాలాపేట: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 3 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది. ఓయూ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సితాఫల్‌మండి, ఎంఎస్‌ క్రియేటివ్‌ కిడ్స్‌ స్కూల్‌లో  మౌలాలికి చెందిన  మహమ్మద్‌ కైసర్‌ అహ్మద్‌(65) హెల్పర్‌గా పని చేస్తున్నాడు. 2017 నవంబర్‌ 21న అతను అదే స్కూల్‌కు చెందిన రెండో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఓయూ పోలీసులు నిందితుడు మహమ్మద్‌ కైసర్‌ అహ్మద్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల నిందితుడికి ఐదేళ్ల జైలు  శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.  ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top