బ్రాండెడ్‌ బట్టల కోసం దారుణం | Ola Cab Driver Killed for Branded Clothes | Sakshi
Sakshi News home page

Mar 31 2018 5:42 PM | Updated on Sep 29 2018 5:29 PM

Ola Cab Driver Killed By Gang In New Delhi to Buy Branded Clothes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విలాసవంతమైన జీవితం గడపడం కోసం కొంతమంది యువకులు అడ్డదారి తొక్కారు. డబ్బు కోసం క్యాబ్‌ డ్రైవర్‌ను దారుణంగా హత మార్చారు. ఈ సంఘటన న్యూఢిల్లీలోని కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్‌కు చెందిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఈ పథకం రచించారు. మార్చి 23న కశ్మీరీ గేట్‌ వద్ద ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నారు. క్యాబ్‌ వారి వద్దకు రాగానే బుకింగ్‌ను రద్దు చేసి.. తుపాకులతో డ్రైవర్‌ను బెదిరించి సోనిపట్‌ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ  నిర్మానుష్యమైన ప్రాంతంలో డ్రైవర్‌ని గొంతు నులిమి చంపేశారు. ఘటన తర్వాత అదే కారులో నగరానికి వచ్చి దాని రూపు రేఖలు మార్చేసి అమ్మేయాలని ప్రయత్నించారు. 

ఇక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో హత్యకు గురైంది ఓలా క్యాబ్‌ డ్రైవర్‌గా పోలీసు నిర్ధారించారు. అతని వివరాలు సేకరించి కాల్‌ డేటా ఆధారంగా నిందుతులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు హత్య చేయడానికి గల కారణాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. పేదరికంలో మగ్గుతున్న వాళ్లు.. ఖరీదైన బట్టలు, విలాసవంతమైన జీవితం కోసం ఈ హత్య చేసినట్లు తెలిపారు. కాగా, ఆరుగురు నిందితుల్లో ఒక మైనర్‌ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఓలా క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement