ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

Mother Killed Five Years Son in Tamil Nadu - Sakshi

చెన్నై, అన్నానగర్‌: అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న ఐదేళ్ల కుమారుడిని హత్యచేసిన తల్లితో సహా నలుగురు నిందితులని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తేని జిల్లా ఉత్తమపాళయం సమీపంలో వున్న కోంబై మదురైవీరన్‌ వీధికి చెందిన మురుగన్‌. అతడి భార్య గీతా (23). వీరి కుమారుడు హరీష్‌ (05) అక్కడ ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. గత 14వ తేదీ ఉదయం నుండి ఇతడు కనబడలేదు. ఈ స్థితిలో అక్కడ ఉన్న శ్మశానవాటికలో ముఖంపై గాయాలతో హరీష్‌ హత్య చేయబడి ఉండటం చూసిన స్థానికులు కోంబై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి హరీష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు జరిపిన విచారణలో హరీష్‌ తండ్రి మురుగన్‌కి, తల్లి గీతాకి మధ్య అభిప్రాయబేదాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో రెండు సంవత్సరాలకు ముందు వారు విడిపోయారు. తరువాత మురుగన్‌ వేరొక మహిళను వివాహం చేసుకున్నాడు.

గీతా అదే ప్రాంతంలో నివసించే ఉదయకుమార్‌ (35)ని రెండవ వివాహం చేసుకుంది. హరీష్‌ను తన తల్లిదండ్రుల ఇంటిలో వదిలేసింది. తరువాత గీత, ఉదయకుమార్‌తో ఆమె కన్నవారి ఇంటి పక్కనే ఉన్నారు. దీంతో హరీష్‌ తరచూ తల్లి గీత వద్దకి రావడం ప్రారంభించాడు. ఇంకా రాత్రి సమయంలో తల్లితో వచ్చి పడుకుని నిద్రపోయేవాడు. ఆ ఇంట్లో ఒక గది మాత్రమే ఉంది. ఇందువలన గీత, ఉదయకుమార్‌ చనువుగా ఉండటానికి అతను అడ్డుగా ఉన్నాడని వారు చిరాకు చెందారు. గీత చెల్లెలు భువనేశ్వరి గత కొన్ని నెలలకు ముందు ఆటో డ్రైవర్‌ కార్తీక్‌ను వివాహం చేసుకుంది. ఈ స్థితిలో కార్తీక్‌ తరచూ గీతా ఇంటికి వచ్చి ఆమెతో చనువుగా ఉన్నాడు. అలాగే భువనేశ్వరి, ఉదయకుమార్‌ చనువుగా ఉంటూ వచ్చారు. దీనిని హరీష్‌ చూశాడు. కాబట్టి అందరి సంబంధాలకు హరీష్‌ అడ్డుగా ఉన్నాడని అతనిని హత్య చేయాలని పథకం వేశారు. పథకం ప్రకారం 14వ తేదీ గీత, ఉదయకుమార్‌ తన ఇంటికి భువనేశ్వరి, కార్తీక్‌లను పిలిపించారు. అక్కడ నలుగురు కలిసి కూర్చొని మద్యం సేవించారు. తర్వాత రాత్రి 8 గంటలకు హరీష్‌కు బిస్కెట్‌ కొనిపించి కోంబై పశువుల ఆస్పత్రి సమీపంలో ఉన్న శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఆ నలుగురు కొంచెం కూడా జాలి లేకుండా ఇటుకలు, కట్టలతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top